మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?


శ్రీమహాలక్ష్మీదేవి భృగుమహర్షి కుమార్తె. శుక్రవారానికి మరో పేరు భృగువారం. మంగళవారం కుజగ్రహానికి సంబంధించినది. శుక్రవారం ఎవరికైనా రుణం ఇస్తే తిరిగి రావడం కష్టం అనీ, మంగళవారం నాడు అప్పు ఇస్తే క‌ల‌హాలు పెరుగుతాయని చాలా మంది నమ్మకం. అందుకే ఈ రెండు రోజుల్లో ఎవరికీ అప్పు ఇవ్వరు. ఇది పూర్తిగా అశాస్త్రీయమైన వాదన. వాస్తవానికి మంగళ, శుక్రవారాల్లో అప్పులు తీర్చుకోవడానికి, సొంతానికి, కుటుంబ వ్యవహారాల కోసం నిరభ్యంతరంగా ఖర్చు పెట్టవచ్చు. ఇలాంటి నియమాలు ప్రజలు నమ్మినంత కాలం సాగుతూనే ఉంటాయి.