‘‘మహావరాహో గోవిందః సుషేణాః కనకాంగది’’ ఆదివరాహమూర్తే గోవిందుడు. తిరుమల ప్రధానంగా ఆయన క్షేత్రమే. శ్రీనివాసుడు వచ్చి అక్కడ ఉండటానికి అనుమతి కోరితే అందుకు వరాహస్వామి అంగీకరించాడు.అందుకు కృతజ్ఞతగా తన వద్దకు వచ్చే భక్తులకు తనకన్నా ముందే ఆయననే దర్శించుకుంటారనిశ్రీవారు వరాహమూర్తికి మాట ఇచ్చారు. అందుకే తిరుమల వెళ్లే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుని ఆ తర్వాత వేంకటేశ్వరుణ్ని దర్శించుకుంటే యాత్రాఫలం దక్కుతుంది.
Showing posts with label గురుముఖం. Show all posts
Showing posts with label గురుముఖం. Show all posts
మనం చేసే తప్పులకు మన బాధ్యత ఎంతవరకు ఉంటుంది?
బుద్ధి కర్మానుసారిణీ... అంటారు. అంటే గతజన్మ కర్మఫలం మనిషిని నడిపిస్తుంది. ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ కష్టాలు పడుతున్నవారు పూర్వ జన్మలో ఇంతకుమించిన పాపఫలాన్ని మూటగట్టుకున్నారని అర్థం. ఇప్పుడు దుష్కర్మలు ఆచరిస్తూ కూడా సుఖంగా జీవిస్తున్న వారు గత జన్మలో సత్కార్యాలు చేసిఉంటారు.
కానీ పైజన్మకు మోయలేనంత పాపభారాన్ని సిద్ధం చేసుకుంటున్నారని వారికి తెలియదు. ఈ కర్మఫలాన్ని నిష్పక్షపాతంగా ఇవ్వడమే భగవంతుడు చేస్తున్న పని. కానీ పాపపుణ్యాల తేడా తెలుసుకుని విచక్షణా జ్ఞానంతో ప్రవర్తించగలిగే అవకాశం, శక్తి దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. అందుకే ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఈ జన్మలో సత్కార్యాలు చేస్తే మరుజన్మకు పుణ్యం సంపాదించుకోగలరు. మనం చేసే తప్పొప్పులకు పూర్తి బాధ్యత మనదే.

వేంకటేశ్వరస్వామి విష్ణురూపమా? శివరూపమా? శక్తిరూపమా?
తిరుమలేశుని విగ్రహం ఆగమాలకు అందని రూపం. వక్షస్థలంపై కౌస్తుభం, చేతికి నాగాభరణాలు, ఆలయగోపురంపై శక్తి వాహనమైన సింహం.. ఇలా విభిన్నదేవతా చిహ్నాలు కలిగిన దివ్యమనోహర విగ్రహం. ‘‘ఇరుండరువురం ఒండ్రాయ్ ఇసైందు’’ (ఇరుమూర్తులూ నీయందే ఉన్నాయి) అంటూ పెయ్ ఆళ్వార్ నోరారా కీర్తించాడు. ‘‘స్కంధ విష్ణ్వాత్మికా శక్తిః వేంకటేశ ఇతీరతః’’ అని స్కంధ పురాణం చెబుతోంది.అంటే శ్రీవారి మూర్తి స్కంధ, విష్ణు, శక్తి ఈ మూడు తత్వాలనూ కలిగి ఉన్నది.
సప్తర్షులకూ ఏడురూపాల్లో సాక్షాత్కరించిన సత్యస్వరూపుడు వేంకటేశ్వరుడు. ఇలా చాలానే ఉదాహరణలు చెప్పవచ్చు. కానీ.. మనకున్న పద్దెనిమిది పురాణాలకుగాను 12 పురాణాల్లో శ్రీవారు విష్ణురూపమేనని చెబుతున్నాయి. కాబట్టి స్వామి నిస్సందేహంగా విష్ణురూపమే. అదీ సర్వదేవతా సమన్వయ స్వరూపం. అంటే ముక్కోటి దేవతలూ స్వామియందే ఉన్నారని అర్థం. ‘‘హరి అవతారములే అఖిలదేవతలు’’ అని అన్నమాచార్యులవారు చెప్పిందీ అదే కదా!

తీర్థం మూడుసార్లు ఎందుకు తీసుకుంటారు?
ఆలయాల్లో దైవదర్శనం అనంతరం తీర్థాన్ని స్వీకరిస్తాం. ఆచార్యుల వారు మూడుసార్లు భక్తులకు తీర్థాన్ని ఇస్తారు. మొదటిసారి తీసుకునే తీర్థం శరీరశుద్ధికి, రెండో సారి ధర్మసాధనకు, మూడోసారి పరమపదం కోసమని పెద్దలు చెబుతారు. అనేక దేవాలయాల్లో రాగి పాత్రల్లో తీర్థాన్ని ఇస్తుంటారు.రాగిపాత్రలోని నీళ్లు అనేక రోగాలను నయం చేస్తాయి. నీళ్లలో కలిపే తులసి ఆకులతో పలు రుగ్మతలు నయమవుతాయి.
దేవుడికి టెంకాయ ఎందుకు కొట్టాలి?
పరంధాముడికి మనం ఇచ్చే నివేదన పవిత్రంగా వుండాలి. నిరంతరం మనల్ని రక్షించే భగవంతుడికి నిండైన మనస్సుతో ప్రార్థన చేయడం ఆ స్వామికి మనం చేసే సేవ. దేవునికి ప్రథమంగా టెంకాయనే నివేదనగా ఇస్తుంటారు. టెంకాయలోని నీరు పవిత్రమైనవి. ఎలాంటి కలుషితం లేకుండా తయారవుతాయి. వీటిలో ఎలాంటి కల్తీవుండదు. టెంకాయ పైభాగం పీచుగా, పెంకు గట్టిగా, లోపల తెల్లటి కొబ్బరి, నీళ్లు వుంటాయి. మనలోని అహాన్ని నిర్మూలించేందుకు టెంకాయను కొట్టాలని పెద్దలు చెబుతారు. ఇదే కాకుండా విఘ్ననాధుడైన వినాయకుడికి తొలి వందనంచేస్తాం. ఆయనకు ఇష్టమైన పదార్థాలను టెంకాయతోనే తయారుచేస్తారు. అందుకు ఆ స్వామికి ఇష్టానుగ్రహం కోసం టెంకాయను సమర్పిస్తాం. టెంకాయకు వున్న మూడుకళ్లు సాక్షాత్తు ఆ త్రినేత్రుడి నేత్రాలని భక్తులు విశ్వసిస్తారు. అందుకనే టెంకాయను మొదటగా దేవుడికి, ఏదైనా శుభకార్యం ముందు కొడుతుంటాం.
దేవుడి గదిలో దీపం ఎందుకు వెలిగించాలి?
భారతీయ సంప్రదాయంలో ప్రతి ఇంటిలోని దేవుని మందిరంలో దీపం వెలిగించాలి. కొందరు పొద్దున వెలిగిస్తే మరి కొందరు పొద్దున, సాయంత్రం కూడా వెలిగిస్తారు. కొన్ని గృహాల్లో అఖండదీపారాధన వుంటుంది. దీపంతో వెలుగు ఏర్పడుతుంది. చీకటిలో దీపం మనకు దారిని చూపించి ధైర్యాన్ని ఇస్తుంది. దీపమనేది ఒక జ్ఞానంలాంటిది. అజ్ఞానాన్ని, చీకట్లను పారదోలుతుంది. మనలోని అహాన్ని దీపపు వెలుగుల్లో ఆవిరి చేయాలి. దీపం ఎప్పుడూ పైకి వెలుగుతూ వుంటుంది. దీపశిఖ స్ఫూర్తిగా మనం కూడా జ్ఞానపు వెలుగులను అందుకుంటూ ఉన్నతశిఖరాలను అందుకోవాలన్నదే దీప పరమార్థం.
దీపాన్ని వెలిగించి ఈ శ్లోకాన్ని జపించాలి
ఘంటానాదం ఎందుకు చేస్తారు?
దేవునికి హారతినిచ్చే సమయంలో గంట కొడుతుంటారు. దేవాలయాల్లోనూ, ఇంట్లో పూజ సమయంలోనూ గంట కొట్టడం మనం చూస్తుంటాం. సృష్టిలో పలురకాల దుష్టశక్తులుంటాయి. ఇవన్నీ మనం దైవ ప్రార్థన ద్వారా అందుకునే పూజాఫలాన్ని పొందే సమయంలో ఆటంకాలు కలిగిస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. వాటిని పారదోలేందుకు ఘంటానాదం చేస్తుంటాం. అయితే గుడిలోనూ, ఇంట్లోనూ పూజలకు వాడే గంటలు వేర్వేరుగా వుంటాయి. దేవాలయంలో పెద్ద గంటలు వుంటాయి. అదే ఇంట్లో పూజా సమయంలో మనం ఒక చేతితో చిన్న గంటను మోగించి మరో చేతితో హారతి ఇస్తాం. గంట శబ్దం మంగళకరం, శుభకరం. అందుకనే మన సంప్రదాయంలో గంటకు విశిష్టమైన ప్రాధాన్యత వుంది. తిరుమలలో శాత్తుమొర... తదితర సమయాల్లో గంటలు మోగిస్తారు. ఈ శబ్దాలను బట్టి భక్తులు దర్శనాలకు సిద్ధమవుతుంటారు
పుస్తకాలను ఎందుకు సరస్వతి రూపంగా భావిస్తాం?
పుస్తకాలు, గ్రంథాలు,పేపర్లు... ఇలా సమాచారాన్ని, బోధన గురించి వివరించేవాటిని మనం పవిత్రంగా పరిగణిస్తాం. చదువులకు తల్లి సరస్వతి దేవి. ఆమె కటాక్షం వుంటే చదువుల్లో రాణిస్తామని పెద్దలు పేర్కొంటారు. గ్రంథపఠనంతో మనకు విజ్ఞానం లభిస్తుంది. అందుకనే పుస్తకాలను మనం సాక్షాత్తు సరస్వతి స్వరూపంగా భావిస్తాం. అందుకే మనం కాలితో వీటిని తాకినప్పుడు వెంటనే క్షమించమని మొక్కుకుంటాం. భారతీయ సంప్రదాయంలో జ్ఞానమనేది పవిత్రమైనది, దైవ సమానమైనది. వీటి ద్వారా మనం ఎంతో నేర్చుకుంటాం. అందుకనే వీటిని గౌరవభావంతో పవిత్రంగా చూస్తాం. ‘విద్య వినయేన శోభతే’ అంటే మనం ఎంత విద్యనార్జించిన అణుకువగా వుండాలని దీని భావం. అలాంటివారికి వినయం మరింత శోభనిస్తుంది. అందుకనే సరస్వతి స్వరూపమైన పుస్తకాలను కాలితో తాకకూడదు.
సరస్వతి నమస్తుభ్యం
వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి
సిద్దిర్భవతు మే సదా
సరస్వతి నమస్తుభ్యం
వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి
సిద్దిర్భవతు మే సదా
పిడుగులు పడే సమయంలో అర్జునా, ఫల్గుణా అని ప్రార్థించాలా?
భారీవర్ష సమయంలో పిడుగులు కూడా పడుతుంటాయి. ఇవి ఎక్కువగా చెట్లపైన పడటం గమనిస్తాం. పిడుగు పడేటప్పుడు పెద్దశబ్ధం వస్తుంది. ఇంట్లో పిల్లలు ఈ శబ్ధాన్ని విని భయపడుతారు. పిల్లలతో పాటు పెద్దలకు భయాన్ని దూరం చేసేందుకు అర్జునా,ఫల్గుణా అని పదినామాలను జపిస్తాం. మహాభారతంలో
అజ్ఞాతవాసం ముగిసిన సమయంలో కౌరవులు విరాటరాజుకు చెందిన గోవులను అపహరిస్తారు.
దీంతో విరాటరాజు కుమారుడైన ఉత్తరుడు వాటిని తీసుకువచ్చేందుకు బృహన్నల (అర్జునుడు) రథాన్ని నడుపుతుండగా యుద్ధానికి బయలుదేరుతాడు. అదే సమయంలో అజ్ఞాతవాసం ముగియడంతో అర్జునుడు తన యథారూపాన్ని దాల్చుతాడు.శత్రు సేనలు చూసిన ఉత్తరుడు భయంతో పారిపోగా అతనికి అర్జునుడు నచ్చజెప్పి తాము దాచిన ఆయుధాల ప్రాంతానికి వెళుతారు.
శమీవృక్షంపై ఆయుధాలను చూసిన ఉత్తరునికి అవి సర్పరూపాలుగా కనిపిస్తాయి. దీంతో అర్జునుడు తన పదినామాలైన అర్జునా,ఫల్గుణా, బీభత్స, కిరీటీ, సవ్యసాచి, కృష్ణ, ధనంజయ, శ్వేతవాహన, విజయ,పార్థ అని జపించమంటాడు. దీంతో ఉత్తరునికి భయం తొలగి ఆయుధాలను చెట్టుపై నుంచి కిందకు తీసుకువస్తాడు. భయాన్ని పొగొట్టే మంత్రంగా దీనిని పెద్దలు చెబుతారు.

కంచి బంగారు, వెండి బల్లుల విశిష్టతను వివరించండి?
బల్లి మనపై పడిందంటే ఏదోగా వుంటుంది. ఒళ్లు జలదరిస్తుంది. ప్రతి ఇంట్లో బల్లులు వుంటాయి. అయితే ఇవి పైన పడితే దోషనివారణకు కంచి క్షేత్రం వరదరాజపెరుమాళ్ ఆలయంలోని బంగారుబల్లి, వెండి బల్లిని తాకాలి. వీటిని తాకితే ఆ దోషాలు వెళ్లిపోతాయని పెద్దలు చెబుతారు. దీనికి సంబంధించిన పురాణగాథ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు వుండేవారు.
నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు. అనంతరం దీన్ని చూసిన గౌతమ మహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు. శాపవిముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజపెరుమాళ్ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లుల రూపంలో వుండి స్వామివారిని ప్రార్థించారు. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది.
ఈ సమయంలో సూర్య, చంద్రులు సాక్ష్యులుగా ఉన్న బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా వుండి భక్తులకు దోషనివారణ చేయమని ఆదేశిస్తాడు. బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించినట్టు మరో కథనం కూడా వ్యాప్తిలో వుంది.

పంచముఖ ఆంజనేయ స్వామి ఆరాధన అంటే?
శ్రీరామభక్తుడైన ఆంజనేయస్వామిని స్మరిస్తే సకల భూత, ప్రేత, పిశాచ భయాలు తొలగిపోతాయి. స్వామివారి ఆరాధనలో పంచముఖ ఆంజనేయస్వామి ప్రార్థనకు విశిష్టత వుంది. శ్రీ హనుమాన్ మాలా మంత్రాన్ని జపిస్తే అన్ని వ్యాధులు, పీడలు తొలగిపోతాయని పరాశర సంహితలోని ఆంజనేయచరిత్ర వివరిస్తోంది. ఐదు ముఖాలతో వుండే స్వామివారి ఒక్కొక్క ముఖానికి ఒక్కో గుణముంది. హనుమాన్ ప్రధానముఖంగా వుంటుంది. ఈ ముఖాన్ని చూస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది. నారసింహునికి అభీష్టసిద్ధి, గరుడునికి సమస్త కష్టాలను నాశనం చేసే శక్తి వుంటుంది. కుడివైపు చివరన వుండే వరహా ముఖం దానప్రపత్తిని ఎడమవైపు చివరన వుండే హయగ్రీవ ముఖం సర్వవిద్యలను కలుగజేస్తాయి. అందుకనే పంచముఖ ఆంజనేయస్వామి దర్శనం అన్ని విధాల శుభమని పురాణాలు చెబుతున్నాయి. తుంగభద్ర నదీతీరంలో స్వామి వారి కోసం తపస్సు ఆచరించిన శ్రీరాఘవేంద్రస్వామికి ఆంజనేయస్వామి పంచముఖ ఆంజనేయులుగా ప్రత్యక్షమైనట్టు తెలుస్తోంది. పంచముఖ హనుమాన్‌కు వున్న పదిచేతుల్లోని ఆయుధాలు భక్తులను సదా రక్షిస్తాయి. నాలుగు దిక్కులతో పాటు పైనుంచి వచ్చే విపత్తులనుంచి భక్తులను కాపాడేందుకు స్వామి పంచముఖంగా దర్శనమిస్తారు.
ఏలినాటి శని ఎన్నేళ్లు వుంటుంది?
ఉదాహరణకు వివాహం, ఇంటి నిర్మాణం, ఉద్యోగం లాంటివి. అయితే వీటి వెనుక చాలా ఇబ్బందులు వుంటాయి. వివాహం జరిగితే చాలా ఖర్చవుతుంది. అలాగే ఇంటి నిర్మాణం పూర్తి చేయడమో లేక ఇంటిని కొనుగోలు చేస్తే అనంతరం ఆర్థిక వనరులకు కటకట ఏర్పడుతుంది. ఒక ఉద్యోగి ఇంటిని కొనుగోలు చేస్తే అతడి నెల జీతం నుంచి నెలవారీగా వాయిదాలు కట్టవలసివుంటుంది. దీంతో జీతం తగ్గుతుంది. అందుకనే ఇల్లుకట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు. శని ప్రభావ తీవ్రత తగ్గించేందుకు పెద్దవాళ్లు అనేకమార్గాలు సూచించారు. విష్ణుసహస్రనామం, సుందరాకాండ పారాయణం, ఆదిత్యహృదయం, భగవంతుని ప్రార్థన చేయాల్సి వుంటుంది. దీంతో పాటు తీర్థయాత్రలు, వ్రతాలు చేయాలి.
ప్రతి శనివారం శనిదేవుడిని ఆరాధించడం, నవ గ్రహాల్లో ఆయన విగ్రహం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చేయాలి. పరమేశ్వరుని పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. పక్షులకు ఆహారం వేయాలి. ముఖ్యంగా కాకులకు ఆహారం పెడితే మంచిది. ఆవులకు ఆహారం వేయడంతో పాటు నల్ల చీమలకు చక్కెర వేయడం లాంటి కార్యాలతో శని ప్రభావాన్ని తగ్గించవచ్చు. యాచకులకు, వికలాంగులకు పెరుగన్నం పెడితే కూడా శని తీవ్రత తగ్గుతుందని పెద్దలు చెబుతారు. అన్నింటికన్నా మనస్సును స్థిరంగా, పవిత్రంగా వుంచుకొని ఆ పరమేశ్వరుని ఆరాధనలో వుంటే ఏ గ్రహ ప్రభావం మనపై పడదు.
దేవునికి తలనీలాలు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి?
దేవునికి తలనీలాలు ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం. తిరుమల దేవునికి కల్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. శిరోజాలు పాపాలకు నిలయాలని పురాణాలు చెబుతున్నాయి. వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలగించుకుంటాం. గర్భంలో వున్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తాడు. శిశువుకు ఉన్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు వుంటాయి.
అందుకనే చిన్న వయసులోనే కేశఖండన కార్యక్రమం నిర్వహిస్తారు. పాపాలను కలిగివున్నందునే శిరోజాలను ‘శిరోగతాని పాపాని’ అంటారు. భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటాం. ఒకరకంగా చెప్పాలంటే మన శిరస్సును భగవంతునికి అర్పించే బదులు కేశాలను ఇస్తాం. తల వెంట్రుకలను తీయడంపై మహాభారతంలో ఒక సంఘటన వుంది. జయద్రధుడు (సైంధవుడు)ని సంహరించేందుకు భీముడు సిద్ధమైన నేపథ్యంలో ధర్మరాజు అతడిని వారిస్తాడు. కౌరవుల సోదరి దుశ్శల భర్త సైంధవుడు. అతన్ని వధించడం ధర్మసమ్మతం కాదు. అందుకనే తల వెంట్రుకలను తీసేస్తే, తల తీసేసినంత పనవుతుందని వివరిస్తాడు. అప్పుడు సైంధవుడికి గుండు గీస్తారు.
తిరుమలలో తల వెంట్రుకలు ఇచ్చే ప్రదేశాన్ని కల్యాణకట్ట అంటారు. మన సంప్రదాయంలో ఎల్లప్పుడూ శుభాన్నే పలకాలని పెద్దలు అంటారు. అందుకనే క్షవరం అనే బదులు కల్యాణం అని పలకాలని జనమేజయుడి సోదరుడైన శతానీకుడు సూచించారు. దీంతో కల్యాణమనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలక్రమంలో కల్యాణకట్టగా స్థిరపడింది. వేం అంటే పాపాలు.. కట అంటే తొలగించేవాడు. అందుకనే తిరుమల శ్రీనివాసుడిని కలౌ వేంకటనాయక అంటారు. కలియుగంలో పాపాలను తొలగించేది ఆ పురుషోత్తముడే. అందుకనే ఆయన సన్నిధానంలో శిరోజాలను సమర్పించడానికి అంత ప్రాముఖ్యత ఉంది.

శివుడు సర్పాన్ని మెడలో ఎందుకు ధరించాడు?
తోక నల్లగా వుంటే అక్క తన దగ్గర వేయి సంవత్సరాలు పరిచారికగా వుండాలని ఒక వేళ తోక తెల్లగానే వుంటే తానే వినత దగ్గర వేయి సంవత్సరాలు బానిసగా వుంటానని కద్రువ పందెం కాస్తుంది. ఇంతలో రాత్రి కావడంతో పొద్దున వచ్చి పరీక్షిస్తామని వెళ్లిపోతారు. గుర్రం తోక తెల్లగానే వుంది ఈ పందెంలో ఎలా నెగ్గాలా అన్న సంశయంలో కద్రువ వుంటుంది. హఠాత్తుగా ఆమెకో ఆలోచన వస్తుంది. తన కుమారులను పిలిచి నల్లగా వున్న వారు వెళ్లి గుర్రం తోకను చుట్టుకోవాలని కోరుతుంది. దీన్ని వారు అంగీకరించరు. ఇది ధర్మసమ్మతం కాదని వాదిస్తారు. వారి వాదనతో ఆగ్రహం చెందిన కద్రువ తల్లి మాటనే పట్టించుకోరు కాబట్టి భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో పడి నశించిపోతారు అని శపిస్తుంది. ఈ శాపంతో భీతిల్లిన కొన్ని సర్పాలు తల్లి మాట ప్రకారం గుర్రం తోకను పట్టుకోవడంతో నిజమేనని భ్రమించిన వినత అన్న మాట ప్రకారం కద్రువ దగ్గర దాసిగా పనిచేస్తుంది. అనంతరం ఆమెకు ఆమె రెండో కుమారుడు గరుత్మంతుడు బానిస బంధనాల నుంచి విముక్తి కలగజేస్తాడు. తల్లి మాట అంగీకరించని ఆదిశేషువు శ్రీమహావిష్ణువు కోసం ఘోరతపస్సు చేస్తాడు. స్వామి ప్రత్యక్షమై ఆదిశేషువును తన శేషతల్పంగా చేసుకుంటాడు. దీంతో ఆదిశేషువుకు ఎలాంటి మృత్యుభయం లేకుండా పోయింది.
రెండో వాడైన వాసుకి మహాశివుని కోసం తపస్సు చేస్తాడు. శంభునాథుడు ప్రత్యక్షమై వాసుకికి మృత్యుభయం లేకుండా చూసేందుకు తన మెడలో నాగాభరణంగా చేసుకుంటాడు. శివుడు మృత్యుంజయుడు. దీంతో వాసుకికి కూడా ఎలాంటి మృత్యువు దరిలోకి రాకుండా పోయింది. ఆ నాటి నుంచి వాసుకి మహాశివుని మెడలో దర్శనమిస్తుంటాడు. సర్పాన్ని మెడ యందు ఆభరణంగా ధరించినవాడు కనుకనే ఆ పరమేశ్వరుడిని నాగాభరణుడు, నాగభూషణడు అని కూడా పిలుస్తాము.
మణిద్వీప వర్ణన మహత్యమేమిటి?
శ్రీచక్ర బిందు రూపిణి శ్రీ రాజరాజేశ్వరి శ్రీదేవి శ్రీ మహావిద్య శ్రీ మహాత్రిపురసుందరి శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణి ద్వీపం. పదునాలుగు లోకాల అనంతరం సర్వలోకంలో ఆమె కొలువై వున్నారు. యావత్ జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది. నాలుగువైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా వున్న ఈ ద్వీపాన్ని వర్ణించాలంటే మన శక్తి చాలదు. మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేష్టితయై వుంటారు. దేవీ భాగవతంలో మణి ద్వీపం గురించిన వర్ణన వుంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారు మయమైన కొండలు ఈ ద్వీపంలో వున్నాయి. అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు.
మొదట వచ్చే ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు వుంటారు.వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతుంటారు. అనంతరం కంచుతో చేసిన రెండో ప్రాకారం వుంటుంది. పచ్చటి అరణ్యములతో, వివిధ రకాల జంతువులు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తుంటుంది. ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు వుంటారు. జ్ఞాన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు. వైకుంఠం, కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం. యావత్ విశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన సంపద అక్కడ వుంటుంది. అన్నింటినీ మించి అమ్మ సన్నిధిలో వుండటమే మహావరం. అందుకనే మణిద్వీప వర్ణన పారాయణం చేస్తుంటారు. ఈ పారాయణంతో ఇంట్లోని వాస్తుదోషాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలూ లభిస్తాయి.

అష్టమహాదానాలని వేటిని అంటారు?
ఇనుమును దానం చేయడం ద్వారా యమలోకానికి వెళ్లకుండా వుండవచ్చని శాస్త్రం తెలుపుతోంది. యముడు ఇనుముతో చేసిన ఆయుధాలు ధరించివుంటారు. దీంతో ఇనుము దానం చేసిన వారు యమలోకానికి వెళ్లరు. భూమిని దానం చేయడం ద్వారా సమస్తభూతాలు సంతృప్తి చెందుతాయి. సువర్ణదానం బ్రహ్మ, దేవతలు, మునీశ్వరులు సంతోషించేందుకు దోహదపడుతుంది. పత్తిని దానం చేయడం ద్వారా యమభటుల భయం ఉండదు. అలాగే ఉప్పును దానం చేస్తే యమధర్మరాజు అనుగ్రహిస్తాడు. గోదానంతో వైతరిణి నదిని దాటిపోవచ్చు. ఎనిమిదో దానంలోని ఏడు ధాన్యాలను దానం చేయడం ద్వారా యముడి నివాసానికి రక్షణగా వుండేవారు ఆనందిస్తారు.
ఈ దానాల్లో కొన్నింటిని సామాన్యులు కూడా చేయవచ్చు. ఉప్పు, నువ్వులు, ధాన్యాలు, పత్తిని దానం చేయవచ్చు. ఈ దానాలను చేయడం ద్వారా లేనివానికి మనకున్నంతలో ఇవ్వడమే అని పరమార్థం.
గోదానం చేస్తే మంచిదంటారు.. ఎందువల్ల?
కొన్ని యుగాలకు పూర్వం ఔద్దాలకి అనే మహర్షి వుండేవాడు. నిత్యం యజ్ఞ జపాదులు నిర్వహించేవాడు. ఒకనాడు తన కుమారుడైన నాచికేతుడిని పిలిచి నదీ తీరంలో వున్న సమిధలు, దర్భలను తీసుకురమ్మని ఆదేశించాడు. నదీ తీరానికెళ్లిన నాచికేతుడికి అవి కనిపించలేదు. నది పొంగడంతో అవి నదీ గర్భంలో కలిసిపోయాయి. తండ్రి దగ్గరకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. అప్పటికే ఆకలితో వున్న మహర్షి యజ్ఞకార్యాన్ని పూర్తిచేయాలన్న నిశ్చయంతో వున్నాడు. ఇంతలో కుమారుడు ఈ విషయాన్ని వెల్లడించడంతో పట్టరాని కోపంతో నాచికేతున్ని నరకానికి వెళ్లు అని శపించాడు. తండ్రి ఆజ్ఞను పాటిస్తున్నానని నాచికేతుడు కూలిపోయాడు. వెంటనే అతని ప్రాణాలు నరకానికి వెళ్లిపోయాయి. తన తొందరపాటును తెలుసుకున్న ఔద్దాలకి ఆ రాత్రంతా రోదించాడు. సూర్యోదయ సమయానికి నాచికేతుని ప్రాణం తిరిగి వచ్చింది. పట్టరాని ఆనందంతో కుమారుడిని కౌగిలించుకున్నాడు. రాత్రి ఏయే లోకాలకు వెళ్లింది వెల్లడించమన్నాడు.
నాచికేతుడు ఆత్మ నరకం చేరుకునేసరికి అక్కడ యమధర్మరాజు స్వాగతం పలికాడు. ఔద్దాలకి మహర్షి నరకానికి వెళ్లమని శాపం పెట్టాడే గానీ చనిపొమ్మని శాపం ఇవ్వలేదు కనుక నాచికేతున్ని అతిథిగా పరిగణిస్తున్నట్టు యమధర్మరాజు చెప్పినట్టు నాచికేతుడు తెలిపాడు. అనంతరం నాచికేతుడికి అతిథి మర్యాదలు చేశాడు. తనకు పుణ్యలోకాలను చూపించమని యమధర్మరాజును కోరగా అతిథుల అభీష్టం నెరవేర్చడం తమ విధి అని యముడు పేర్కొన్నట్టు అతను తెలిపాడు. అనంతరం పుణ్యలోకాలను వీక్షించగా అందులో దివ్యతేజస్సులు కలిగిన పుణ్యపురుషులు వుండటాన్ని గమనించాడు. వారి గురించి యమధర్మరాజును ప్రశ్నించగా వారు గోదానం చేయడంతో పుణ్యలోకప్రాప్తి కలిగిందన్నాడు.
శుభసమయాల్లో గోదానం చేయడం ద్వారా పుణ్యగతులను పొందవచ్చని చెబుతూ.. మూడు రాత్రులు నేల మీద పడుకుని నీటిని తీసుకుంటూ దీక్ష చేసిన వారు గోవులను దానం చేస్తే మంచి ఫలితాలు వుంటాయని వివరించాడు. చిన్న వయస్సులో మంచి ఆరోగ్యంతో వున్న ఆవును దానం చేస్తే ఆ ఆవుపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాలు పుణ్యలోకాల్లో వుండే వరాన్ని పొందవచ్చని యమధర్మరాజు తెలిపినట్టు నాచికేతుడు తండ్రికి తెలిపాడు. ఈ కథ ద్వారా గోదానం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు.
రుద్రాక్షలు శివుని కన్నీటి బిందువులా?
ఏక ముఖ రుద్రాక్ష- శివుడు
రెండు ముఖాలు - శివకేశవులు
మూడు ముఖాలు - అగ్ని రకం
నాలుగు ముఖాలు - బ్రహ్మ స్వరూపం
పంచముఖాలు - కాలాగ్ని
ఆరు ముఖాలు - షణ్ముఖ (సుబ్రమణ్యస్వామి)
ఏడు ముఖాలు - అనంగ (ఐశ్వర్యం)
ఎనిమిది ముఖాలు - వినాయకుడు
తొమ్మిది ముఖాలు - భైరవుడు
పది ముఖాలు - జనార్దనుడు
పదకొండు ముఖాలు - రుద్రుడు
పన్నెండు ముఖాలు- ద్వాదశాదిత్యులు
పదమూడు ముఖాలు - కార్తికేయుడు
పద్నాలుగు ముఖాలు - ఇవి పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన రుద్రాక్షలు
రామరాజ్యం ఆదర్శంగా ఎలా నిలిచింది?
సాక్షాత్తు వైకుంఠనాథుడు శ్రీ మహావిష్ణువు భూమిపై శ్రీరామచంద్రుడిగా జన్మించాడు. ప్రజాపాలన ఎలా చేయాలో స్వయంగా నిర్వహించి యావత్ విశ్వానికి ఆదర్శంగా నిలిచాడు. అందుకనే త్రేతాయుగం గడిచి వేల సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ రామరాజ్యం అని తలుచుకుంటాం. వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలో రామరాజ్య వర్ణన ఉంది.
సర్వమంగళం
జగదభిరాముడు కోసల దేశాన్ని పాలించాడు. ఆయన పాలనలో గృహిణులకు వైధవ్యం వుండేదికాదు. దొంగల భయం లేదు. అందరూ ఆరోగ్యవంతులుగా ఎటువంటి రోగాలు లేకుండా సుఖంగా జీవించేవారు. ప్రజలు, పాలకులు ధర్మబద్ధులై వుండేవాళ్లు. ఎలాంటి విరోధాలు లేకుండా అనురాగంగా నివసించే వాతావరణం వుండేది. వర్షాలు సకాలంలో కురిసేవి. ప్రజలు రాగ, ద్వేషాలకు అతీతంగా తమ వృత్తుల్లో రాణించేవారు. రామనామం తారకమంత్రంగా అందరూ జపించేవారు. రామచంద్రునితో సహా అందరూ సత్యాన్ని పలికేవాళ్లు. అసత్యాలు, దుర్వార్త ప్రచారం, పుకార్లకు ఆ నాటి సమాజంలో విలువ లేదు. చెట్లు నిత్యం పచ్చగా వుండటంతో చల్లటి వాతావరణం కనువిందు చేసేది. ధర్మ ప్రవర్తనతో అకాల మరణాలు వుండేవి కావు.
ఒక మానవుడు ప్రశాంతంగా, సంతృప్తిగా ఎలా జీవించాలో అందుకు అవసరమైన పరిస్థితులు రాముడు పాలించిన రాజ్యంలో ఉన్నాయి. అందుకనే ఆయన పాలించిన రాజ్యాన్ని రామరాజ్యం అంటారు. పాలకులు ప్రజలకు ఏం చెబుతారో ముందుగా ఆచరించి చూపాలి. అప్పుడే ప్రజానీకానికి మార్గదర్శిగా వుంటారు. దేశంలో యజ్ఞయాగాదులు నిత్యం నిర్వహించేవారు. ప్రకృతిని ఆరాధించేవారు. అందుకు తగినట్టుగా వర్షాలు కురిసేవి. పంటలు సకాలంలో వచ్చేవి. పాలకులతో పాటు ప్రజలు నీతి, ధర్మం తప్పలేదు. ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేసి పాలించారు. అందుకనే రామరాజ్యం అని మన పెద్దలు చెబుతుంటారు.

Subscribe to:
Posts (Atom)