ల‌లితాసహ‌స్ర నామాల‌ను ఎవ‌రు ర‌చించారు? ఈ శ్లోకాల విశిష్ట‌త ఏమిటి?

జ‌గ‌జ్జ‌న‌ని ఆది ప‌రాశ‌క్తి సృష్టే స‌క‌ల విశ్వం. విష్ణుమూర్తి అవ‌తారమైన హ‌య‌గ్రీవుడు అమ్మ‌వారి వేయి నామాల‌ను అగ‌స్త్య‌మ‌హ‌ర్షికి బోధించారు. స‌క‌ల చ‌రాచ‌ర జ‌గ‌త్తును పాలించే అమ్మ‌వారి స‌హ‌స్ర నామాల‌ను ప‌ఠిస్తే స‌క‌ల శుభాలు క‌లుగుతాయి. సాక్షాత్తు త‌ల్లి పార్వ‌తీదేవి మ‌న‌కు ఇచ్చిన గొప్ప‌వ‌రం ఈ నామావ‌ళి. అమ్మ‌వారి యశస్సుని కీర్తిని, శ‌క్తిని తెలిపే నామాల‌ను ప‌ఠిస్తే అనేక మంచి ఫలితాలు క‌లుగుతాయి. ప్ర‌తి మ‌నిషి జీవితంలో అనేక మైన జాత‌క దోషాలుంటాయి. వీటి నివార‌ణ‌కు మ‌నం ఎన్నో శాంతి ప్ర‌క్రియ‌లు చేస్తుంటాం. అయితే అమ్మ‌వారి ల‌లితా నామాల‌ను చ‌దివితే ఈ జాత‌కదోషాలు మ‌న‌ల‌ను బాధించ‌వు. బ్ర‌హ్మాండ‌పురాణంలో ల‌లితా దేవి సహస్ర నామావ‌ళి వుంది. ప‌ర‌మ‌ప‌విత్ర‌మైన శ్రీ‌పురం అమ్మ‌వారి నివాస‌స్థ‌లాన్ని సూచించే శ్రీ‌చ‌క్ర ప్ర‌స్తావ‌న పురాణాల్లో వుంది. అమ్మ‌వారి స్థానం క‌నుక శ్రీ‌చ‌క్రానికి అంత విశిష్ట‌త ల‌భించింది. భండాసురున్ని సంహ‌రించేందుకు జగ‌న్మాత ల‌లితా దేవిగా జ‌న్మించిన‌ట్టు పురాణాలు వెల్ల‌డిస్తున్నాయి. నియ‌మ‌బ‌ద్ధంగా, శుచిగా అమ్మ‌వారి నామాల‌ను ప‌ఠిస్తే అనంత‌మైన ఆనందం క‌లుగుతుంది. ఈ మంత్రాల‌ను వాశిన్యాది దేవ‌త‌లు అమ్మ ఆన‌తి ప్ర‌కారం మొద‌ట ప‌ఠించారు. అనంత‌రం హ‌య‌గ్రీవులు అగ‌స్త్య‌మహ‌ర్షికి ఉపదేశించారు. ఆదిశంక‌రాచార్యులు, భాస్క‌రాచార్యులు సహస్రనామాలపై వ్యాఖ్యానాలు చేశారు. స‌మ‌స్త జ‌గ‌త్తును న‌డిపించే ఆ త‌ల్లి నామావాళిని ఏకాగ్ర‌త‌తో చ‌దివితే మ‌న‌కు అంతా మంచే జ‌రుగుతుంది.