ఆలయాల్లోకి పూర్ణకుంభంతో ఎవరిని స్వాగతించాలి?

దేవాలయాల్లోకి మఠాధిపతులను, రాజ్యాధికారమున్నవారిని, వేద వేదాంగ పండితులను పూర్ణకుంభంతో ఆహ్వానించాలి. పూర్ణకుంభం అంటే జలంతో నిండిన కుంభం. కలశం, పాద ప్రక్షాళన, హస్త ప్రక్షాళన, పానీయం. ఆచమనం అన్నిటికీ జలాన్నే అందించాలి. పూర్ణకుంభం సకల జగత్తునకు ప్రతీక అని అర్థం. కుంభం భూమి అందులోనిది జలం, పట్టుకొని వచ్చే విప్రులు అగ్ని. ఆకాశం, వాయువుకు కుంభం నెలవు. పంచభూతాలు, ప్రకృతి, పరమాత్మ విశేషానుగ్రహం పొందిన వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు.తరువాత ఆ జలాన్ని వేదమంత్రాలతో అభిమంత్రించి ప్రోక్షణం చేస్తారు. అతిథి, అతని వెంట వచ్చినవారు మంత్రపావనులై లోకానికి ఉపకరించాలని అంతరార్థం.