ఉపవాసం ఎందుకు చేయాలి

భారతీయ సంప్రదాయంలో ఉపవాసాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పండగపూటో.. వారానికి ఒకరోజో.. రెండు రోజులో ఉపవాసం చేసే వాళ్లని చూస్తుంటాం. అయితే.. అలా ఎందుకు చేయాలి.. ఎలా చేయాలి అన్న విషయం పెద్దగా తెలియకపోవచ్చు. ఉపవాసం అంటే ఉప ఆవాసం అన్నమాట. అంటే భగవధ్యానం సంపూర్ణ ఉపవాసంగా భావించొచ్చు. అంతేకాదు.. ఉపవాసం చేయటం శరీరానికి ఎంతో మేలు చేస్తుందని సైన్స్‌ ప్రకారం చెబుతుంటారు. ఉపవాసం వల్ల రక్తం శుద్ధి అయి జీర్ణవ్యవస్థ బాగుపడుతుంది. జీర్ణవ్యవస్థ కూడా బాగా మెరుగుపడుతుందన్నమాట.