పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్లిపోతే అశుభమా?

కొన్నిసార్లు పూజ కోసం తీసుకెళ్లిన కొబ్బరికాయ కొట్టిన తర్వాత చూస్తే కుళ్లిపోయి ఉంటుంది. ఇది దోషమని కొందరు భావిస్తుంటారు. కానీ పూజకు కొట్టిన కొబ్బరికాయ కుళ్లిపోతే ఎలాంటి దోషం లేదు. అపచారం అంతకన్నా కాదు. కొట్టిన కాయ కుళ్లిందని తెలిస్తే వెంటనే పూజ ఆపేసి, శుచియై తిరిగి పూజ చేసుకోవాలి. వాహనాలకు దిష్టి తీసేందుకు కొట్టిన కాయ కుళ్లిపోయినదైతే వాహనాన్ని మళ్లీ కడిగి మరో కొబ్బరికాయ కొట్టుకోవాలి