తిరుమలలో భక్తులు పూలు ఎందుకు పెట్టుకోకూడదు?

శ్రీవారికి సంబంధించినంత వరకూ శ్రీరంగం భోగమండపం. కంచి త్యాగమండపం. అలాగే.. తిరుమల పుష్పమండపం. అక్కడ పుట్టే ప్రతిపువ్వూ స్వామికోసమే పూస్తుంది. ఆయన సేవలో తరిస్తుంది. అందునా స్వామి పుష్పప్రియుడు. అందుకే అక్కడ పూసే ప్రతిపువ్వునూ వేంకటేశ్వరుడి సేవకే వినియోగించాలి తప్ప మానవమాత్రులు ధరించకూడదన్నది ఈ నియమంలో అంతరార్థం.